12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా  ఈ నెల 12 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో ధర్నాలు నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ప్రగతి భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను కేంద్రం కొంటదా ? లేదా అని నిలదీశారు. సీఎం కేసీఆర్..బీజేపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు బిజినెస్‌లో దందాలు లేవన్నారు. తనది ఫాంహౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అన్నారు కేసీఆర్. 
 
తాము ఏ తప్పు చేయలేదన్నారు. కేబినెట్ అంటే ఉద్యమ కారులే అన్నారు. యోగ్యత ఉన్నవారికి మంత్రి పదవులు ఇస్తామన్నారు. ప్రాజెక్టులు కోసం తమ కుటుంబానికి చెందిన భూములు కూడా పోయాయన్నారు. మా బాస్ తెలంగాణ ప్రజలు, మేం ఆర్డర్ తీసుకుంటే ప్రజల నుంచి తీసుకుంటామన్నారు. గెలిపిస్తే అధికారంలో ఉంటాం లేదంటే అపోజిషన్‌లో ఉంటామన్నారు. ఏదీ ఏమైనా మేం నిజాయితీగా ఉంటామన్నారు. మేం ఏం చెబితే అదే లెక్క అని ఎప్పుడు అనలేదన్నారు. ఓటమి వస్తే కుంగిపోవడం, విజయం వస్తే అహంకారం ప్రదర్శించడం చేయమన్నారు. జర్నలిస్ట్ సంక్షేమానికి నిధి ఏర్పాటు చేసిన ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ కాదా ? అని ప్రశ్నించారు. 

ఈ నెల 10వ తేదీన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సీఎం పర్యటిస్తానన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష జరపనున్నారు.