పోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్ 

పోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్ 

పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చెప్పారు. అడవిని కాపాడటం సామాజిక బాధ్యతన్న ముఖ్యమంత్రి, అటవీ అధికారుల వ్యవహారశైలి కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. శవదహనానికి కట్టెలు తీసుకొచ్చినా కొందరు అతి చేస్తున్నారని, దీనిపై అటవీశాఖ మంత్రి, అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొన్ని పార్టీలకు దొరికిందే అవకాశమన్నట్లు పోడు భూముల పేరుతో జెండాలు పట్టుకొని తిరుగుతారని పరోక్షంగా వామపక్షాలపై విరుచుకుపడ్డారు. పోడు భూముల పంపిణీ తర్వాత ఉపాధి,ఉద్యోగాలు లేని గిరిజన బిడ్డల కోసం చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.