షర్మిల పగపట్టింది.. ఓడించేందుకు డబ్బుల కట్టలు పంపుతుందంట: కేసీఆర్

షర్మిల పగపట్టింది.. ఓడించేందుకు డబ్బుల కట్టలు పంపుతుందంట: కేసీఆర్

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిలపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సమైక్య వాదులు, వారి చెంచాలు నర్సంపేటలో నిరసన తెలిపితే ప్రజలు అడ్డుకున్నారని.. అందుకే షర్మిల పెద్ది సుదర్శన్ రెడ్డిపై పగ పట్టారని వ్యాఖ్యానించారు.  బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపుతుందట..ఆమె డబ్బుల కట్టలు గెలవాలా? మిషన్ భగీరథ గెలవాల అని ప్రశ్నించారు కేసీఆర్.  పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఓడిస్తే ..ఓడిపోదామా .. షర్మిల డబ్బుల కట్టలను తిప్పి కొట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

పార్టీల చరిత్ర చూసి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే  కాంగ్రెస్ అని అన్నారు. ఓటు అంటే ఆశామాషీ కాదని.. తలరాతలు మార్చే గీత అన్నారు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి  పాఖాల ఆయకట్టుకు నీరు అందించారని చెప్పారు.  గతంలో నర్సంపేటలో ఎవరూ చేయని అభివృద్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారని తెలిపారు. వరంగల్ వెళ్లాల్సిన మెడికల్ కాలేజీని పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు తీసుకొచ్చారని చెప్పారు.  రాహుల్ గాంధీకి ఎవుసం అంటే తెలియదు కానీ ఆయన  వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలన్నారు కేసీఆర్ .