చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సినీ నటుడు చలపతిరావు మరణం పట్ల సీఎం  కేసీఆర్  సంతాపం  తెలిపారు.  వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతిరావు, తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారని సీఎం అన్నారు. నటుడిగా, నిర్మాతగా మూడు తరాల నటులతోనూ పనిచేసిన చలపతిరావు మరణం, సినీ రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

78 ఏళ్ల చలపతిరావు ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో  గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చలపతిరావు బాధపడుతున్నారు. దీంతో ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.