
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం టీఆర్ఎస్ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. పార్టీ తరపున నామినేషన్ వేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డికి సూచించారు. నామినేషన్ పత్రాల దాఖలుకు సంబంధించి.. సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని ఆదేశించారు సీఎం. ఎమ్మెల్సీ గా ఎంపిక చేసినందుకు…. క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.