కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత మోహన్ కు సీఎం శుభాకాంక్షలు

కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత మోహన్ కు సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద: కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పత్తిపాక మోహన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారా(2022)నికి’  డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన 'బాలల తాత బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కడం గొప్ప విషయమని సీఎం అన్నారు. గాంధీజీ పై రాసిన బాల సాహిత్యానికి గాను తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. కీర్తి శేషులు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి శిష్యుడు, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన పత్తిపాక మోహన్.. సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇక పోతే... 

కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోషహన్  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత సి.నారాయణరెడ్డి శిష్యుడైన పత్తిపాక మోహన్ రాసిన బాల‌ల తాత  బాపూజీ (క‌విత్వం) కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైంది. సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పత్తిపాక మోహన్ పిల్లల కోసం అనేక రచనలు చేశారు. పురస్కారానికి ఎంపికైన బాలల తాత బాపూజీతోపాటు.. పిలల కోసం మన కవులు, జో అచ్యుతానంద జోజో ముకుంద, ఒక్కేసి పువ్వేసి చందమామ, చందమామ రావే వంటి అనేక రచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు.