గ్రామస్తులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్

గ్రామస్తులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. తర్వాత వాసాలమర్రి సర్పంచ్ ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్. కాసేపట్లో  సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. గ్రామంలోని సమస్యలతో పాటు... అభివృద్ధి పనులపై చర్చించనున్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ తో పాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి.. పలువురు నేతలు ఉన్నారు. సీఎం పర్యటనతో గ్రామంలోకి బయటివారు రాకుండా ఆంక్షలు పెట్టారు.