అధికారులతో సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లు

అధికారులతో సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లు

ఉన్నతాధికారులతో రెండో రోజూ సీఎం సమీక్ష

న్యూఢిల్లీ, వెలుగు: అప్పుల సేకరణపై బుధవారం రెండో రోజూ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎస్, ముఖ్య శాఖల కార్యదర్శులతో వరుస మీటింగ్ లు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్ సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) కొత్తగా పెట్టిన షరతులపై చర్చించారు. ఈ సంస్థలతో కుదిరిన ఒప్పందం ప్రకారం వాటి నుంచి రావాల్సిన మిగతా అప్పుల విషయంలో అధికారుల సలహాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ ను దగ్గరుండి పరిశీలించారు. అలాగే రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న అప్పుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చించారు. ఎఫ్ఆర్ బీఎంపై పరిమితులు విధించడం, ఇతర మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులకు అడ్డుగా మారుతున్న కేంద్ర నిర్ణయాలపై అధికారులతో ప్రస్తావించినట్లు తెలిసింది. అప్పుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇతర రాష్ట్రాలకు ఎలా అమలవుతుందో చూడాలని చెప్పినట్లు సమాచారం.