దీన్​దయాళ్ ​అవార్డు గ్రహీతలకు సీఎం సన్మానం

దీన్​దయాళ్ ​అవార్డు గ్రహీతలకు సీఎం సన్మానం
  • పీఆర్ మంత్రి ఎర్రబెల్లి, అధికారులను అభినందించిన కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్ కు రాష్ట్రం నుంచి ఎంపికైన గ్రామ, మండల, జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సన్మానించారు. అవార్డు పొందిన వారిలో కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామ సర్పంచ్ మడది భారతి, రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ సర్పంచ్ తెడ్డు అమృత, సిద్దిపేట జిల్లా మిట్టపెల్లి సర్పంచ్​వంగ లక్ష్మి, సిద్దిపేట జిల్లా మల్యాల సర్పంచ్ దరిపల్లి వజ్రవ్వ, ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి సర్పంచ్​పుండ్రు పోతారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్ సర్పంచ్ శైలజ, పెద్దపల్లి జిల్లా సుందిల్ల సర్పంచ్​దాసరి లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట సర్పంచ్​కల్వకుంట్ల వనజ, జగిత్యాల జిల్లా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణ, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, సంగారెడ్డి జడ్పీ సీఈవో సీహెచ్ ఎల్లయ్య, పెద్దపల్లి డీపీవో గీత, ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాం రెడ్డి, ఎంపీడీవో జయశీల ఉన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావులను సీఎం కేసీఆర్ సన్మానించారు.  కాగా,  ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఊర్లలో  రోడ్లు, టాయిలెట్స్, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రానికి 12 దీన్ ద‌‌యాళ్ అవార్డులు దక్కాయన్నారు. సంగారెడ్డి జెడ్పీ చైర్ ప‌‌ర్సన్, మండ‌‌ల ప‌‌రిష‌‌త్ అధ్యక్షులు, గ్రామ‌‌ పంచాయ‌‌తీల స‌‌ర్పంచ్ లు, సీఈవో, ఎంపీడీఓలు తదితరులను ఎర్రబెల్లి సన్మానించారు.