సీఎంలా కాదు..తమ్ముడిలా ఆదరించారు : కేసీఆర్

సీఎంలా కాదు..తమ్ముడిలా ఆదరించారు : కేసీఆర్

రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహన్ సేవలు కోల్పోవడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్. నరసింహన్ కు ప్రగతి భవన్ లో వీడ్కోలు పలికిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. నరసింహన్ తనను తమ్ముడిలా ఆదరించారని అన్నారు. తనకు ఓ పెద్దదిక్కులాగా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన నరసింహన్ వెళ్లిపోవడం బాధాకరమన్నారు. తాను నరసింహన్ ను పెద్ద మనిషిలాగానే చూశానన్నారు. తనను కూడా ఆయన సీఎంలా  కాకుండా, తమ్ముడిలా ఆదరించారన్నారు. ఎప్పుడైనా కొంచెం బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారని అన్నారు. తాను మొదలు పెట్టిన ప్రతీ పని విజయవంతం కావాలని నరసింహన్ కోరుకునే వారని అన్నారు కేసీఆర్. ఏ పని చేసినా తనను దీవించి పంపించే వారని అన్నారు.