మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం

మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతాయిపల్లిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కలెక్టర్ హరీష్ను  కుర్చీలో సీఎం కేసీఆర్ కూర్చొబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ను 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.