ఆదివాసీ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఆదివాసీ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ -10లో కొత్తగా నిర్మించిన కొమురం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. ఆదివాసీ బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా భవన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ఆయన.. స్వరాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన, లంబాడీ బిడ్డలందరూ తలెత్తుకునేలా ఆదివాసీ భవన్ నిర్మించామని అన్నారు. 

గిరిజన బిడ్డల సమస్యలు తీర్చాల్సిన అవసరముందని, ఇందుకోసం ఒక్కో అడుగు వేస్తున్నామని కేసీఆర్ అన్నారు. చదవు, విదేశాలకు వెళ్లడం, గిరిజన పోడు భూముల విషయంలో ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో క్రమంగా పురోగమిస్తున్నామని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివాసీ భవన్ గిరిజన బిడ్డల హక్కుల పరిరక్షణకు వేదిక కావాలని, వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని ఆకాంక్షించారు.