వర్షాలు, వరదలపై కేసీఆర్ ఆరా

వర్షాలు, వరదలపై కేసీఆర్ ఆరా
  • మంత్రులు, ఉన్నతాధికారులకు సూచనలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌‌ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. శుక్రవారం వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద, ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్‌‌ ద్వారా అందించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గోదావరి ముంపు ప్రాంతాల్లో పరిశీలన చేశారు. ఖమ్మం జిల్లా మున్నేరు ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ తెలిపారు. జీహెచ్ఎంపీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

కేసీఆర్​తో భీమ్ ఆర్మీ చీఫ్​ భేటీ

సీఎం కేసీఆర్​తో భీమ్​ఆర్మీ చీఫ్​చంద్రశేఖర్​ఆజాద్​భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితతో కలిసి శుక్రవారం రాత్రి ప్రగతి భవన్​కు వెళ్లిన ఆజాద్​మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిశారు. వీరి భేటీలో జాతీయ రాజకీయాలు, బీఆర్ఎస్​ఏర్పాటు కారణాలు, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్​విగ్రహం ఏర్పాటు, సెక్రటేరియెట్​కు అంబేద్కర్​పేరు పెట్టడం తదితర అంశాలపై చర్చించారు.