వాసాలమర్రిలో కలియతిరుగుతున్న సీఎం కేసీఆర్

వాసాలమర్రిలో కలియతిరుగుతున్న సీఎం కేసీఆర్

యాదాద్రి-భువనగిరి: సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలోని దళితవాడల్లో కలియతిరిగారు. దళితవాడల్లో కాలినడకన ఇంటింటికి వెళ్లి దళితబంధు పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని.. స్పష్టమైన అవగాహనతో దళితబంధు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు గంటకుపైగా దళితవాడల్లో కాలినడకన తిరిగిన సీఎం... ఆ తర్వాత సర్పంచ్ అంజనేయులు ఇంటికి వెళ్లి భోజనం చేశారు.