సీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు

సీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు

భద్రాచలానికి హెలీకాఫ్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత కొద్దిరోజులగా కురుస్తున్న భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్నది. ఈ ప్రకృతి విపత్తు నేపథ్యంలో, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీఎం ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములౌతున్నారు.

ఈ నేపథ్యంలో.. ఉహించని వరదలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, రెస్కూ టీంలతో సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగా కాపాడుతున్నది.

భద్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సీఎం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.దాంతో పాటు వరద బాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.