సీఎం కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా

సీఎం కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా టూర్ వాయిదా వేస్తున్నట్టుగా సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి 2023 ఆగస్టు 19 న కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. 

అక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ తో పాటు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా దానిని ఆగస్టు 23కు వాయిదా వేశారు. ఈ నెల 19 రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ టూర్ వాయిదా పడింది.