
హైదరాబాద్: రెవెన్యూ చట్టంలో మార్పులు తప్పవన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేసీఆర్.. జిల్లా పరిషత్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రజలు కోరుకునే విధంగా రెవెన్యూ చట్టం పటిష్టంగా ఉంటుందన్నారు. రెవెన్యూలో అవినీతి కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు . 16 ఎంపీ సీట్లు గెలుస్తామని.. ఢిల్లీ లో చక్రం తిప్పెది తామేనని అన్నారు కేసీఆర్. 16 ఎంపీ సీట్లు గెలుస్తామని ఇప్పటికే 10 రిపోర్ట్ లు వచ్చాయని చెప్పారు. 32 జడ్పిలు టీఆర్ ఎస్ గెలిచేలా పనిచేయాలని నేతలను ఆదేశించారు కేసీఆర్.
అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును ప్రకటించారు సీఎం కేసీఆర్. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అభ్యర్తిగా పుట్టా మధు పేరు ప్రకటించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు టిక్కెట్ లు ఇచ్చే బాద్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు కేసీఆర్. రెండు జిల్లాలకు ఒక్కరు చొప్పున మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కో-ఆర్డినేటర్లుగా నియమించారు . నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కొత్త వారికి అవకాశాలు వస్తాయని నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.