రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నా.. ఇది కాస్త డిఫరెంట్. ఎందుకంటే కొందరు బీచ్ లో రీల్స్ చేస్తూ సముద్రంలో మునిగిపోయారు.. కొందరు బిల్డింగ్ పై నుంచి పడిపోయారు.. కొందరు వెహికిల్స్ తగిలి ప్రమాదాలకు గురయ్యారు. వీళ్లు అలాంటి ప్రమాదాలేవీ లేకుండానే.. చావు వరకు వెళ్లివచ్చారు. రీల్స్ పిచ్చితో చచ్చిబతికి ఇద్దరు యువతుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలే చలికాలం.. అది కూడా మంచుకొడలపైన.. ఇక ఎలా ఉంటుందో ఊహించండి. గడ్డకట్టే చలిలో.. ఆక్సిజన్ కిట్ లేకుంటే ప్రాణాలు పోయే పరిస్థితుల్లో బాలీవుడ్ సాంగ్స్ కు రీల్స్ చేశారు ఇద్దరు యువతులు. హిందీ సినిమాలలోని మూమెంట్స్ ను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వీళ్లు.. ఈ సారి మాత్రం సీన్ బ్యాక్ ఫైర్ కావటంతో.. కాపాడండి.. కాపాడండి అంటూ హాహాకారాలు చేయాల్సిన పరిస్థితి.
వామ్మో.. ఒక్కసారిగా నల్లబడిపోయిన స్కిన్:
వీడియోలో చూపిస్తున్నట్లు.. ఒక యువతి గడ్డకట్టే చలిలో స్వెటర్ లేకుండా రీల్స్ చేస్తూ ఉంది. చేస్తూ చేస్తూనే ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. పలుచటి చిఫాన్ చీర ధరించిన యువతి.. జీరో టెంపరేచర్ లో షూట్ చేస్తున్న సమయంలో.. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి తలనొప్పి, తీవ్రమైన అలసట తో పాటు ఒక్కసారిగా.. నిమిషాల వ్యవధిలోనే కళ్ల చుట్టూ, మొహం, శరీర భాగాలు నల్లగా మారిపోయాయి. వణుకుతూ కిందపడిపోయి కాపాడండీ అంటూ కేకలు పెట్టడం మొదలు పెట్టటింది. దీంతో ట్రీట్ మెంట్ ఇవ్వడంతో కాస్త కోలుకుంది.
ఇక రెండో అమ్మాయి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక్క క్షణం ఆలస్యమైనా చచ్చిపోతాను అన్నట్లుగా అరవటం మొదలెట్టింది. దీంతో స్థానికులు, గైడ్స్ ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చి కాపాడారు.
ఏకిపడేసిన ఇన్స్టా యూజర్లు:
ఈ ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాలో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. రీల్స్ పేరున చీప్ పబ్లిసిటీ.. యూట్యూబ్ లిమిట్స్ దాటేసింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఒక యూజర్ పోస్ట్ చేసింది.
ఇలాంటి వాళ్లకు మెడికల్ హెల్ప్ కూడా చేయవద్దని కొందరు రాసుకొచ్చారు. మంచు ప్రదేశాల్లో ఒక్క మిస్టేక్ లైఫ్ ను రిస్క్ లో పడేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చి ఫేమ్ తాత్కాలికం.. అంటూ కొందరు సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇప్రెస్ చేయడానికి పోయి.. జ్ఞపకాలుగా మిగలవద్దు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
