సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర మాజీ ఎంపీ శంభాజీ రాజే భేటీ

సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర మాజీ ఎంపీ  శంభాజీ రాజే భేటీ

ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు, మాజీ ఎంపీ శంభాజీ రాజే ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయనకు సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. భేటీలో ఇరువురు దేశ రాజకీయాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలను శంభాజీకి సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని  శంభాజీ  అభిప్రాయపడ్డారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు విస్తరించాల్సి వుందన్నారు.  ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎంకు ఛత్రపతి శంభాజీ రాజె అందించారు.