28న కేసీఆర్‌, జగన్ భేటీ

28న కేసీఆర్‌, జగన్ భేటీ

నదీ జలాల వాడకం, విభజన సమస్యలపై చర్చ
దానికంటే ముందు సీఎస్ లు, ఉన్నతాధికారుల సమావేశం
కొత్త సచివాలయ శంకుస్థాపనలో జగన్ పాల్గొనే అవకాశం

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌ ఈ నెల 28న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ లో సమావేశం కానున్ నారు. కృష్ణా, గోదావరి జలాల పూర్తి స్థా యి వినియోగం, పంపిణీ, విభజన చట్టం లోని వివాదాలు–పరిష్కార మార్గాలపై ఆ భేటీలో చర్చించనున్ నారు. సీఎంల సమావేశానికి ముందే.. ఈ నెల 26, 27 తేదీల్లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల,
ఇతర శాఖల ఉన్నతాధికారులు భేటీ కానున్ నారు. వారు పలు అంశాలపై చర్చించి ముఖ్యమంత్రులకు నివేదిక ఇస్తారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, ఏపీలో పనిచేస్తు న్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావడంపైనా సీఎంలు చర్చిస్తారని తెలుస్తోంది.

సెక్రటేరియట్ లోని ఏపీ భవనాలను ఇప్పటికే అప్పగించగా.. సామగ్రి తరలింపు ఈ నెల చివరినాటికి పూర్తవనుంది. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించనున్న భవనాల అంశం సీఎంల భేటీ నాటికి ఓ కొలిక్కిరానుంది. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ తోపాటు, ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి మరో బిల్డింగును కేటాయించనున్నట్టు సమాచారం. ఈ నెల 26న హైదరాబాద్‌కు రానున్న జగన్‌.. 29 వరకూ ఇక్కడే ఉంటారు.  27న జరగనున్న తెలంగాణ కొత్త సచివాలయ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్‌ పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.