
కామారెడ్డి, వెలుగు : ప్రతిఒక్కరికీ చదువు, వైద్యం ఉచితంగా అందించాలన్న డిమాండ్‌తో కామారెడ్డిలో 70 ఏండ్ల వృద్ధుడు బుధవారం నామినేషన్ వేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన చిందం మల్లయ్య ఏడో తరగతి వరకు చదువుకున్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన గతంలో ఓసారి సర్పంచ్ పదవికి పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా కామారెడ్డి నుంచి బరిలో నిలిచేందుకు నామినేషన్ వేశారు.
ఆయన మాట్లాడుతూ ప్రైమరీ నుంచి ఎంబీబీఎస్స్థాయి వరకు ప్రతిఒక్కరికీ ఫ్రీ చదువు గవర్నమెంట్స్కూళ్లలోనే అందించాలని, ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. ఈ దిశగా ప్రచారం చేస్తానని మల్లయ్య తెలిపారు.