సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్ లను తొలగిస్తాం : కేసీఆర్

సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్ లను తొలగిస్తాం : కేసీఆర్

మొక్కలు బతక్కపోతే.. కఠిన చర్యలు

అసెంబ్లీ కొత్త మున్సిపల్ బిల్లు సందర్భంగా సీఎం

హరితహారంతోనే తెలంగాణ పచ్చగా మారుతుందని చెప్పారు సీఎం కేసీఆర్. కొత్త మున్సిపల్ చట్టం లక్ష్యాలు, ఉద్దేశాలను వివరిస్తూ.. హరితహారం ప్రాధాన్యతను వివరించారు కేసీఆర్. హరితహారంలో భాగంగా 85 శాతం చెట్లను బతికించకపోతే.. కొత్త చట్టం ప్రకారం విలేజ్ సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్ పదవులు పోతాయి… ఆ తర్వాత వాళ్లంతా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందే అని కేసీఆర్ హెచ్చరించారు.

రాష్ట్రానికి సర్జరీ చేస్తున్నాం

టానిక్, టాబ్లెట్ లతో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పోవనీ.. అందుకే.. ఏకంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. ఆ సర్జరీనే ఇపుడు స్టార్ట్ చేస్తున్నామన్నారు. కొత్త చట్టంతో GHMC, HMDA ఉద్యోగుల బదిలీలు ఉంటాయన్నారు. HMDA,GHMC ఉద్యోగి అవసరమైతే కాగజ్ నగర్ కు కూడా బదిలీ కావొచ్చని చెప్పారు కేసీఆర్.