హన్మకొండ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం

హన్మకొండ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం

భద్రాచలం, ఏటూరునాగారం పర్యటనను ముగించుకున్న సీఎం కేసీఆర్ హన్మకొండ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకోగానే.. నేరుగా అసెంబ్లీకి వెళ్లి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ జులై 2న యశ్వంత్ సిన్హా ను హైదరాబాద్ కు పిలిపించి, జలవిహార్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ కేసీఆర్ మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.