భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం కేసీఆర్

భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. వరద తదనంతర పరిస్థితిని సమీక్షిచేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి పువ్వాడతో పాటు ఎంపీలు ఘన స్వాగతం పలికారు. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. వరద పరిస్థితి, జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  మహోగ్రంగా ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ చేశారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన ముఖ్యమంత్రి ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ పర్యటన సాగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా.. ప్రతికూల వాతావారణ నేపథ్యంలో రోడ్డు మార్గాన బయలుదేరారు.