సమైక్యరాష్ట్రంలో సామాజిక వివక్షే కాదు, ఆధ్యాత్మిక వివక్ష

V6 Velugu Posted on Oct 19, 2021

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం కేసీఆర్. సామాజిక వివక్షే కాదు,ఆధ్యాత్మిక వివక్ష కూడా కొనసాగిందన్నారు. పుష్కరాలు కూడా నిర్వహించేవారు కాదన్నారు. కృష్ణ, గోదావరి పుష్కరాలు కూడా ఆంధ్రాకే పరిమితం చేశారన్నారు. ఉద్యమ సమయంలో తాను ప్రశ్నిస్తే పుష్కర ఘాట్లు నిర్మించారన్నారు. తెలంగాణలో విశిష్ట పుణ్యక్షేత్రాల్లో ఒకటి యాదగిరి గుట్ట లక్ష్మినారసింహస్వామి ఆలయమన్నారు.  యాదాద్రిని చాలా అధ్భుతంగా తీర్చిదిద్దామన్నారు. 50 ఏళ్ల కిందట చిన్నప్పుడే యాదాద్రికి వచ్చానన్నారు. తెలంగాణకు గొప్పఆధ్యాత్మిక చరిత్ర ఉందన్నారు. జోగుళాంబ ఆలయం గొప్ప శక్తిపీఠమన్నారు. కృష్ణ పుష్కరాలను జోగుళాంబ ఆలయం దగ్గర ప్రారంభించానన్నారు

Tagged Telangana, AP, CM KCR, visit, yadadri temple devlopment

Latest Videos

Subscribe Now

More News