కేంద్ర ప్రభుత్వం ఎవరికోసం పని చేస్తోంది

కేంద్ర ప్రభుత్వం ఎవరికోసం పని చేస్తోంది

కేంద్ర ప్రభుత్వ ఇవాళ ప్రవేశ పెట్టిన  బడ్జెట్ సామాన్యులను నిరాశపర్చిందన్నారు సీఎం కేసీఆర్. బడ్జెట్ లో డొల్లతనం,మాటల గారెడీ మాత్రమే కన్పించిందన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి ఆత్మవంచన చేసుకోవాలన్నారు. బడ్జెట్ తో ఎవరికీ ఎలాంటి లాభం లేదని విమర్శించారు. చెప్పింది శాంతి ధర్మం.. ఆచరించింది అదర్మం అని అన్నారు. బడ్జెట్ తో దేశ ప్రజలను ఘోరంగా వంచించిందన్నారు. బడ్జెట్ లో కేంద్రం కల్ల..డొల్ల ప్రచారం చేశారన్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్ తో కూడా సమానం కాదన్నారు. పేద ప్రజలకు బడ్జెట్ లో మిగిలింది గుండుసున్నానే అని అన్నారు. దళితులు,గిరిజనులపై కేంద్రానికి ఉన్న చిత్త శుద్ధి ఏంటో దీంతో  తెలుస్తోందన్నారు. రైతులకు క్షమాపణ చెప్పి.. బడ్జెట్ లో రైతుల పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. యూరియా,ఎరువులపైసబ్సిడీ తగ్గించారని..ఉపాధి హామీ పథకానికి 25 వేల కోట్ల కోత పెట్టారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోందన్న కేసీఆర్..కేంద్రానికి మెదడు లేదన్నారు.

కేంద్రం చెప్పిన SC,ST జనాభా తప్పుడు లెక్కలని...దేశంలో 40 కోట్ల వరకు SC,STలు ఉంటారని.. వారి కోసం కేవలం 12,800కోట్లు బడ్జెట్ పెట్టారన్నారు...ఇది సిగ్గు చేటన్నారు సీఎం కేసీఆర్. కేంద్రానిది అత్యంత చెత్త పవర్ పాలసీ అని..మీటర్లు పెట్టి చార్జీలు వసూలు చేయడం  సంస్కరణలా అని ప్రశ్నించారు. దీనికి తోడు దరిద్రపు సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్  మోడల్ అంటే లోన లొటారం..పైన పటారం లాంటిదేనన్నారు. కరోనా అప్పుడు కూలీలకు రైళ్లు కూడాఏర్పాటు చేయలేకపోయిందని...దానితో నడిచి నడిచి వాళ్ళు చనిపోయారన్నారు. అంతేకాదు.. హెల్త్ బడ్జెట్ రూపాయి కూడా పెంచలేదన్నారు. బీజేపీ అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు అని అన్నారు.

ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు.. ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఎల్ఐసీని కూడా అమ్ముతున్నారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.  2022 కల్లా అందరికి ఇల్లు అనేది  పచ్చి బోగస్ అని అన్నారు. నల్లధనం తెస్తా.. రూ.15 లక్షలు ఇస్తామని...బ్లాక్ మనీగాళ్లను బయటకు పంపిన ఘనత ప్రధాని మోడీదన్నారు. ఆయన దేశానికి కాదు...గుజరాత్ కే ప్రధాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఇండెక్స్ లో దేశ ర్యాంకు దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించివేస్తామని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.

 

మరిన్ని వార్తల కోసం..

కేంద్ర బడ్జెట్ 2022–23: శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపు