కేంద్ర బడ్జెట్ 2022–23: శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపు

కేంద్ర బడ్జెట్ 2022–23: శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో రూ.39.44 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా ఆర్థిక శాఖకు 15.38 లక్షల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత దేశ రక్షణకే పెద్ద పీట వేశారు నిర్మలమ్మ. రక్షణ శాఖకు రూ.5.25 లక్షల కోట్లు కేటాయించారు. దీని తర్వాత ఆహార, పౌర సరఫరాల శాఖ, రోడ్డు రవాణా, హైవేస్ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, రైల్వే మినిస్ట్రీ, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, ఎరువుల శాఖ, విద్యా శాఖలకు ప్రాధాన్యం ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు

  • మొత్తం బడ్జెట్: రూ.39.44 లక్షల కోట్లు
  • ఆర్థిక శాఖకు కేటాయింపు: రూ.15.38 లక్షల కోట్లు
  • రక్షణ శాఖ: 5.25 లక్షల కోట్లు
  • కన్జ్యూమర్ అఫైర్స్, ఆహార, పౌర సరఫరాల శాఖ: రూ.2.17 లక్షల కోట్లు
  • రోడ్డు రవాణా, హైవేస్‌ మంత్రిత్వ శాఖ: రూ.1.99 లక్షల కోట్లు
  • పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ: రూ.1709.5 కోట్లు
  • హోం శాఖ: రూ.1.86 లక్షల కోట్లు
  • రైల్వే శాఖ: 1.40 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1.38 లక్షల కోట్లు
  • పంచాయతీ రాజ్‌ శాఖ: రూ.868.57 కోట్లు
  • వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ: రూ.1.32 లక్షల కోట్లు
  • రసాయనాలు, ఎరువుల శాఖ: రూ.1.07 లక్షల కోట్లు
  • మత్స్య, పశు సంవర్థక, డెయిరీ శాఖ: రూ.6037 కోట్లు
  • ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ: రూ.2941 కోట్లు
  • మినిస్ట్రీ ఆఫ్​ కమ్యూనికేషన్స్: రూ.1.05 లక్షల కోట్లు
  • విద్యా శాఖ: రూ.1.04 లక్షల కోట్లు
  • ఆరోగ్య శాఖ: రూ.86.2 వేల కోట్లు
  • ఆయుష్ శాఖ: రూ.3050 కోట్లు
  • జల శక్తి శాఖ: రూ.86 వేల కోట్లు
  • హౌసింగ్, అర్బన్ అఫైర్స్ శాఖ: రూ.76.5 వేల కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖ: రూ.25 వేల కోట్లు
  • అటామిక్ ఎనర్జీ శాఖ: రూ.22.7 వేల కోట్లు
  • విదేశాంగ శాఖ: రూ.17.25 కోట్లు
  • ఎంఎస్‌ఎంఈ శాఖ: రూ.21.4 వేల కోట్లు
  • విద్యుత్ శాఖ: రూ.16 వేల కోట్లు
  • వాణిజ్య, పరిశ్రమల శాఖ: రూ.14.4 వేల కోట్లు
  • సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ: రూ.14.2 వేల కోట్లు
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ: రూ.14.3 వేల కోట్లు
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌: రూ.13.7 వేల కోట్లు
  • సోషల్ జస్టిస్, ఎంపవర్‌‌మెంట్ శాఖ: రూ.13 వేల కోట్లు
  • టెక్స్‌టైల్స్ శాఖ: రూ.12.3 వేల కోట్లు
  • పౌర విమానయాన శాఖ: రూ.10.66 వేల కోట్లు
  • గిరిజన సంక్షేమ శాఖ: రూ.8451 కోట్లు
  • మైనారిటీ సంక్షేమ శాఖ: రూ.5020 కోట్లు
  • ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ: రూ.2800 కోట్లు