రోశయ్య మృతికి కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

రోశయ్య మృతికి కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్  సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

మరోవైపు రోశయ్య మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జీవించినంత కాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం తనన  తీవ్రంగా కలచివేసిందన్నారు. మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, సమాజానికి కూడా తీరని లోటు. వ్యక్తిగతంగా కూడా ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాన్నారు రేవంత్ రెడ్డి.

రోశయ్య మరణం తీరని లోటు అన్నారు మంత్రి హరీశ్ రావు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెదరని ముద్ర వేశారన్నారు. ఆయన చేయని పదవంటూ లేదన్నారు. ఆయన పొందని గౌరవం కూడా లేదంటూ కొనియాడారు. ప్రతిపక్షాలను సైతం నెప్పించగలిగిన నేత అంటూ ప్రశంసించారు. ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీగా, ఎంపిగా.. సీఎంగా చెదరని ముద్ర వేశారన్నారు. ప్రతి పక్షంలో వున్న అధికారంలో వున్న హుందాగా పని చేసే వారని గుర్తు చేసుకున్నారు హరీశ్. ప్రతి పక్ష నాయకులకు సైతం.. సన్నిహితుడిగా వుండే వారన్నారు. ఏ శాఖ బాధ్యత చేపట్టిన ఓ మార్క్ వేసేవారన్నారు. రోశయ్యకు తనకు అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను పిలిచి మాట్లాడే వారని గుర్తు చేసుకున్నారు.  మంచి భవిష్యత్ వుందని రోశయ్య తనకు చెప్పే వారన్నారు హరీశ్.