ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలే.. కేసీఆర్ కు రేవంత్ లేఖ

ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలే.. కేసీఆర్ కు రేవంత్ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, బోర్డు తప్పిదాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2019 ఇంటర్ ఫలితాలతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆ ఘటన నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో విద్యావ్యస్థను సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదలకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తే.. చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఇంటర్ లో మెజారిటీ పిల్లలు ఫేయిల్ అవ్వడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే నన్నారు. ఫేయిల్ అయిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం

 

కొడుకు ఆత్మహత్య తట్టుకోలేక ఉరేసుకున్న తండ్రి

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు

 

మరిన్ని వార్తల కోసం

యూపీ+యోగి=ఉపయోగి కాదు..యూస్ లెస్

ఒమిక్రాన్ ఎఫెక్ట్: సెకండ్‌ వేవ్‌ కంటే భారీగా కేసులు వస్తయ్!