కొడుకు ఆత్మహత్య తట్టుకోలేక ఉరేసుకున్న తండ్రి

కొడుకు ఆత్మహత్య తట్టుకోలేక ఉరేసుకున్న తండ్రి

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. చల్ల భాను ప్రకాశ్ అనే 10వ తరగతి విద్యార్థి.. రెండు రోజుల కిందట ఇంట్లో  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  నిన్న భాను ప్రకాశ్ అంత్యక్రియల తర్వాత  తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి చల్ల రాంబాబు ఇవాళ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

మృతుడు భాను ప్రకాశ్ ఖమ్మంలోని హర్వేస్ట్  ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో బర్త్ డే వేడుకలు చేసుకున్నాడంటూ.. పాఠశాల యాజమాన్యం భానుప్రకాశ్ ను వారం పాటు సస్పెండ్ చేసింది. దీంతో మనస్ధాపానికి గురైన భాను ప్రకాశ్... సత్తుపల్లిలో ఉన్న తన ఇంటికి వచ్చాడు. తన ఫ్రెండ్ కు వీడియోకాల్ చేసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ కు తరలించారు. చికిత్స అందిస్తుండగా భాను ప్రకాశ్ మృతి చెందాడు. 

భాను ప్రకాశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కళ్లముందే కన్న కొడుకు చనిపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు తండ్రి రాంబాబు. కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతానికి కొద్దిదూరం లోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భాను ప్రకాశ్ మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. తన కొడుకును సస్పెండ్ చేయడం వల్లే మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

CFSL కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన అమిత్ షా

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు