ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు, మద్దతు ధర

ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు, మద్దతు ధర

ఆర్ఒకే రకమైన పంటలు పండించడం వల్లే రైతులకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై సీఎం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతులు పండించే మార్పు రావాలని అన్నారు. రైతులు   పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం ఒకే రకమైన  మార్కెట్ అని తెలిపారు. డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని.. ఈ విషయం తాను 20 ఏళ్ల క్రితం  రవాణా శాఖ మంత్రిగా పని చేసినప్పటి నుంచి చెబుతున్నానని తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోడికి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు అనేక మార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇంతకు మించిన గత్యంతరం లేదు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి అని సిఎం అన్నారు.

ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి. అమ్ముడుపోయే సరుకే పండించాలి. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతున్నది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెబుతున్నది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి. రైతుల ఆలోచనలో మార్పు రావాలి. నిర్మాణాత్మకమైన మార్పులు రావాలి అని సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశంలో చెప్పారు.

ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు

ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని కేసీఆర్  వ్యవసాయ సమీక్షలో నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని సూచించారు.  ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని , ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందన్న కేసీఆర్  ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయించారు.