నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష 

నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష 

నల్లగొండ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదలచేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహా సంతాప సభలో పాల్గొన్న అనంతరం కేసీఆర్ నల్లగొండ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అత్యాధునిక హంగులతో నల్లగొండ కళాభారతి సాంస్కృతిక కేంద్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ను సుందరీకరించాలని కేసీఆర్ ఆదేశించారు. నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు సీఎంకు పనుల పురోగతిని వివరించారు. మరోవైపు నాగార్జున సాగర్ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్తో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. 

నల్లగొండపై ముఖ్యమంత్రి మరోసారి వరాలజల్లు కురిపించారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్, నల్లగొండ క్లాక్ టవర్ వద్ద ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి వెంటనే జీవో జారీ చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. మిర్యాలగూడలో కోర్టు నిర్మించాలన్న విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. 

For more News..

నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు జరిమానా

అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది