నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు జరిమానా

నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు జరిమానా

దేశ రాజధాని భల్స్వా డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. మంటలార్పేందుకు అగ్నిప్రమాపక సిబ్బంది రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం భల్స్వా డంపింగ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. ఊపిరి ఆడటం లేదని స్థానికులు  ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు మొత్తం బూడిదతో నిండిపోయాయని, దుర్వాసన వస్తోందని తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డులో చెలరేగిన అగ్ని ప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. 

మరిన్ని వార్తల కోసం

అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

శాకుంతలం నుంచి మరో పోస్టర్ రిలీజ్