కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకున్నా

కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకున్నా

వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ..వరంగల్‌ విద్యా, వైద్య, పరిశ్రమల కేంద్రం కావాలన్నారు. ప్రతి పాత తాలుకాలో మాతాశిశు సెంటర్లు రావాలని, వరంగల్‌కు డెంటల్‌ కాలేజీతోపాటు ఆస్పత్రి మంజూరు చేస్తున్నామని తెలిపారు.

మరోవైపు కరోనాపై దుష్ప్రచారం సరికాదన్నారు సీఎం కేసీఆర్. కరోనా వస్తే టెంపరేచర్‌ పెరుగుతుంది. పారాసిటమాల్‌ వేసుకోమని డాక్టర్‌ చెప్పారు. తనకు కూడా కరోనా వచ్చిందని..అప్పుడు నేను కూడా కేవలం పారాసిటమాల్‌ మాత్రమే వేసుకున్నానని తెలిపారు కేసీఆర్.జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చన్నారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దని..మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అనవసరంగా లేని ఉత్పాతాన్ని సృష్టించవద్దని సూచించారు సీఎం.