మోడీ బ్రహ్మ కాదు..శాశ్వతంగా ప్రధానిగా ఉండటానికి

మోడీ బ్రహ్మ కాదు..శాశ్వతంగా  ప్రధానిగా ఉండటానికి
  • ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
  • మోడీ పాలనలో 8 రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చారు
  • మోడీ బ్రహ్మ కాదు..ప్రధానిగా శాశ్వతంగా ఉండటానికి
  • ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు సీఎం కేసీఆర్. అభివృద్ధిలో తెలంగాణ ఎప్పుడూ వెనక్కి వెల్లబోదన్నారు. హైదరాబాద్ జలవిహార్ లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెల్ కమ్ సభలో మాట్లాడిన కేసీఆర్..మోడీ తప్పు చేయకపోతే రైతు చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. మోడీ అడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. ఎవరూ శాశ్వతం కాదని...మోడీ కంటే ముందు చాలామంది ప్రధానులు అయ్యారని చెప్పారు. మోడీ బ్రహ్మ కాదు ప్రధానిగా శాశ్వతంగా ఉండటానికి అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆరోపించారు. 

మోడీ పాలనలో (ఎన్డీయే) 8  రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారని సీఎం కేసీఆర్ అన్నారు. టార్చ్ లైట్ పెట్టి వెతికినా మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు కనిపించడం లేదన్నారు. ఏ ఒక్క వర్గానికి మోడీ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. రైతులు 13 నెలలు ఆందోళనలు చేస్తే మోడీ భూతులు తిట్టారని చెప్పారు. రైతులపై జోకులు వేయడానికా మోడీని ప్రధాని చేసిందని ప్రశ్నించారు. అంతర్జాతీయ ఇండెక్స్ లో భారతదేశం ఎక్కడ ఉందో మోడీ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో తాము, ఫ్రెండ్లి పార్టీ కలిసి 95 సీట్లు గెలిచామన్నారు. తాము ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.