
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందామని హైదరాబాద్కు వచ్చిన వాళ్లను అణగబట్టి, దొరకబట్టి జైళ్లో వేసినమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయాల కోసం చిల్లరగాళ్లు వేసే చిల్లర ఎత్తుగడలను ప్రజలు సీరియస్ గా గమనించాలి. అయినా పట్టించుకోకుంటే అందరి బతుకులు ఆగమైతై’’ అని ఆయన కామెంట్ చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కొంతమంది చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనంలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు.
అబద్ధాల ఒరవడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నరు. దీన్ని ఆపాలి. చిల్లరగాళ్లు వేసే చిల్లర ఎత్తుగడలను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలి. దేశంలో ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకోవాలి. అయినా పట్టించుకోకుంటే అందరి బతుకులు ఆగమైతై’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ తిరుగుబాటు చేయకుంటే.. ప్రతిఘటించకుంటే .. ఆనాడు తెలంగాణ వచ్చేది కాదు. మహాత్మాగాంధీ నాయకత్వంలో లక్షల మంది పోరాటం చేయకుంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు’’ అని కేసీఆర్ చెప్పారు.