చిక్కటి రక్తం నాకు ఇష్టం ఉండదు.. ఎక్కువగా ఆస్పిరిన్ గోలీలు తీసుకుంటున్న: ట్రంప్

చిక్కటి రక్తం నాకు ఇష్టం ఉండదు.. ఎక్కువగా ఆస్పిరిన్ గోలీలు తీసుకుంటున్న: ట్రంప్

వాషింగ్టన్: డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన దాని కన్నా ఎక్కువ డోసులో ఆస్పిరిన్  మాత్రలు తీసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  తెలిపారు. తాజాగా ఓ ఆయన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. ‘‘రక్తాన్ని పలచన చేసేందుకు ఆస్పిరిన్ బాగా పనిచేస్తుందని డాక్టర్లు చెప్తారు. చిక్కగా ఉన్న రక్తం నా గుండె ద్వారా ప్రవహించడం నాకు ఇష్టం ఉండదు. పలచని రక్తమే నా గుండె ద్వారా ఫ్లో కావాలని కోరుకుంటా. అందుకే, డాక్టర్లు సూచించిన దానికన్నా ఎక్కువగా ఆస్పిరిన్  డోసులు తీసుకుంటున్నా” అని ట్రంప్  వెల్లడించారు. కాగా, ట్రంప్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఆయన డాక్టర్  సీన్  బార్బబెల్లా స్పందించారు. కార్డియాక్  అరెస్టును నివారించడానికి ట్రంప్  రోజూ 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్  తీసుకుంటారని తెలిపారు.