జనవరి 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగా ఉద్యోగ మేళా

జనవరి 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, వెలుగు : ఈ నెల 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు  జిల్లా ఇంటర్​ విద్యా నోడల్ అధికారి షేక్​సలాం, హెచ్​సీఎల్ ఇన్​చార్జి రాజుల రాజేశ్​ కుమార్​ గురువారం తెలిపారు.  2024, -25లో ఇంటర్​ పూర్తి చేసుకున్న విద్యార్థులు, 2026లో ఇంటర్​ పూర్తి చేసుకునే విద్యార్థులకు హెచ్​సీఎల్​ టెక్​బీ ఆధ్వర్యంలో ఈ జాబ్​ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 

 హెచ్​సీఎల్​ టెక్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ  ప్రోగ్రాం కోసం ఎంపీసీ, సీఈసీ, బీపీసీ, ఓకేషనల్, హెచ్ ఈసీ  గ్రూప్ విద్యార్థులు ఈ మేళాకుహాజరుకావాలన్నారు.  మేళాకు వచ్చే విద్యార్థులు తమ వెంట ఎస్సెస్సీ మెమో,  ఇంటర్ పాస్​ లేదా ఆన్​లైన్ సర్టిఫికెట్,  ఆధార్​ కార్డు తీసుకొని రావాలన్నారు.   పూర్తి వివరాలకు హెచ్​సీఎల్​ ఏరియా ప్రతినిధి రాజుల రాజ్​కుమార్  ఫోన్​ నంబర్  8074065803,  97‌‌‌‌‌‌‌‌665424 ను సంప్రదించాలని సూచించారు.