
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడత పంపిణీ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మరియు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు.
For More News..
సిడ్నీ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 244 ఆలౌట్
గుజరాత్ మాజీ సీఎం సోలంకి కన్నుమూత
ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. హెచ్చరించిన కేంద్రం