యాదాద్రి పున:ప్రారంభ తేది ఖరారు

V6 Velugu Posted on Oct 19, 2021

ఆలయ పునర్ ప్రారంభానికి మహాకుంభ సంప్రోక్షణ చేపట్టబోతున్నామన్నారు సీఎం కేసీఆర్.  వచ్చే ఏడాది మార్చి 28న  మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభమవుతుందన్నారు. మహా కుంభ సంప్రోక్షోణలో భాగంగా 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం చేస్తున్నామన్నారు.  ఈ యాగానికి 5 నుంచి 6 వేల మంది రుత్వికులు..వారి సహాయకులుగా మరో 3 నుంచి 4 వేల మంది అవసరముంటదన్నారు. యాగానికి లక్షా 50 వేల లీటర్ల కల్తీలేని నెయ్యి అవసరముంటదన్నారు. 

Tagged CM KCR, March 28, 2022, Yadadri , Mahakumbha Samprokshan

Latest Videos

Subscribe Now

More News