TSPSC పేపర్ లీకేజీపై.. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి

TSPSC పేపర్ లీకేజీపై.. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి

ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు హోరందుకున్నాయి. టీఎప్సీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు చేపట్టిన ఏబీవీపీ విద్యార్థులు బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో ఓయూ ఆర్ట్ కాలేజీ విద్యార్థులంతా కాలేజీ ముందు బైఠాయింది నిరసనలు తెలియచేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డిని బర్తరఫ్ చేసి, బాద్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

తర్వాత పేపర్ లీకేజీని నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూ లైబ్రరీ నుంచి ప్రగతి భవన్ వరకు చలో ప్రగతి భవన్ యాత్ర చేపట్టారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని,  డిమాండ్ చేశారు. 

కోఠీ విమెన్స్ కాలేజీ విద్యార్థులు కూడా పేపర్ లీకేజీ విషయంలో ఆందోళనకు దిగారు. ఏబీవీపీ విద్యార్థులంతా కాలేజీ నుంచి బయటివెళ్లి నిరసన తెలియజేసే క్రమంలో పోలీసులు వచ్చి గేటుకు తాళం వేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం దారుణమని, ఈ పేపర్ లీక్ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో టీఎస్పీఎస్పీ చెలగాటం ఆడుతుందని విద్యార్థులు నిరసనలు తెలిపారు. టీఎస్పీఎస్సీ ఛైర్మెన్, కార్యదర్శి లను తొలిగించకపోతే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు.