
రాష్ట్రంలోఇప్పుడు కరెంట్ కోతలు లేవని ఎటూ చూసిన వరి కోతలే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. 60 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించలేదని, కానీ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో కొద్దిరోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం చూపించామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్రాఫ్,పవర్ హాలీడేలు లేవని చెప్పారు.
తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉందని చెప్పిన సీఎం కేసీఆర్ .. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ మోడల్ ను కోరుకుంటున్నారని చెప్పారు. తక్కువ సమయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ప్రతి రంగంలోనూ తెలంగాణ టాప్ లో ఉందన్నారు, ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా మారిందని వెల్లడించారు. మన పథకాలను వేరే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.
ఎన్నికల టైమ్ లో ఇంటింటికి నళ్లా నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నామని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడంలో తెలంగాణ టాప్ లో ఉందని కేసీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయ వంద శాతం సక్సెస్ అయిందని చెప్పారు. దళితభందు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. గృహలక్ష్మీ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందస్తామని కేసీఆర్ తెలిపారు. జూలై నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. పోడు భూములు అందించాక వారికి కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.