అయిజ, వెలుగు : బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన పట్టణంలోని కర్నూల్ రాయచూర్ చౌరస్తా వద్ద వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఎరుకలి మధు, సుంకులమ్మ దంపతుల కుమారుడు సుబ్బారాయుడు(6) ఆరు బయట ఆడుకుంటున్నాడు. అదే సమయంలో వీధి కుక్కలు వచ్చి బాలుడిపై దాడి చేశాయి.
దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీధి కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
