మాజీ ప్రధాని పీవీకి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని పీవీకి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన భూమిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. జ్ఞాన భూమిలో సర్వమత ప్రార్థనలు చేశారు. జ్ఞాన భూమి అంతా భజనలు, కీర్తనలతో మారుమోగింది. పీవీ ఘాట్ దగ్గర అటు అధికార పార్టీతో నాయకులతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పీవీకి నివాళులు అర్పించారు. పీవీ గుర్తుగా ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా 50 దేశాలలో కూడా ఈ రోజు ఆయన జయంతి ఉత్సవాలను జరపడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

For More News..

బతికున్న శిశువును చనిపోయాడని కవర్లో చుట్టిన ఆస్పత్రి సిబ్బంది

కోట్ల రూపాయల వద్దనుకుంటున్న సెలబ్రిటీలు

మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు