
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తున్నారు సీఎం కేసీఆర్. అంతకు ముందు ఏరియల్ వ్యూ ద్వారా నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరికి పూజలు చేసి….వాయినం సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 140 కిలోమీటర్ల మేర… గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
మేడిగడ్డ తర్వాత గోలివాడ పంపుహౌజ్ కు చేరుకొని ఎల్లంపల్లి బ్యారేజీని పరిశీలిస్తారు. . ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని విడుదల చేయనున్నారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. ఆ తర్వాత గోలివాడ నుంచి ధర్మపురి చేరుకుంటారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి మళ్లీ హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు సీఎం కేసీఆర్.