బండి సంజయ్​కి సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్

బండి సంజయ్​కి సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి మంగళవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు కేసీఆర్ ఓ లేఖ రాశారు. ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు.. ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తి గా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని లేఖలో  పేర్కొన్నా రు.  

దీనికి బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంజయ్​కి బర్త్ డే విషెస్ చెప్పారు.