బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమన్నారు. బతుకమ్మ కోసం చెరువులు,దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 2 న గ్రామ పంచాయతీలలో.. 4న నగరాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎంగిలి పూలతో మొదలై తొమ్మిదవ రోజు మహా బతుకమ్మతో ముగియనున్నాయి.
