జమ్మూకాశ్మీర్​ను బీజేపీ ప్రయోగశాలగా మార్చేసింది:ముఫ్తీ

జమ్మూకాశ్మీర్​ను బీజేపీ ప్రయోగశాలగా మార్చేసింది:ముఫ్తీ

పాట్నా: మోదీ సర్కార్​ జమ్మూ కాశ్మీర్​ను ఓ ప్రయోగశాలగా మార్చేసిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. జమ్మూకాశ్మీర్​ ప్రస్తుతం ప్రత్యేక హోదా కోల్పోయిందని,  రాష్ట్రాన్ని విడదీసి రెండు కేంద్రపాలిత కేంద్రాలుగా విభజించారన్నారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్​తో ప్రయోగాలు చేస్తున్నదని ముఫ్తీ మండిపడ్డారు.

పాట్నాలో ప్రతిపక్షాలు సమావేశమైన ఒకరోజు  తర్వాత ఆమె విలేకరులతో  మాట్లాడారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం మొత్తాన్ని ‘కాశ్మీరీకరణ’ చేసే ముప్పు ఉందన్నారు. ఆర్టికల్​ 370ని రద్దు చేశారని, ముగ్గురు మాజీ సీఎంలతో సహా కాశ్మీర్ నేతలను జైలులో పెట్టారని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఢిల్లీలో  కేంద్రం చేసిన ఆర్డినెన్స్ ను గతంలో జమ్ము కాశ్మీర్​లోనూ చేశారు. అప్పుడు దాని వెనుక నేను ఉన్నట్లు కొంతమంది అపార్థం చేసుకున్నారని పీడీపీ చీఫ్​ తెలిపారు.