గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

అసెంబ్లీ సమావేశం, మున్సిపల్ చట్టంపై వివరణ

హైదరాబాద్, వెలుగు:

గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి సుమారు గంటపాటు నరసింహన్​తో సమావేశమయ్యారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ చట్టంలోని సవరణలు, పంచాయతీ రాజ్ చట్ట సవరణలు చేయడంతోపాటు కొత్తగా ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా అంశాలను గవర్నర్ కు సీఎం వివరించారని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్​ను నియమించిన తర్వాత తొలిసారిగా గవర్నర్ తో సీఎం భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ గవర్నర్ మార్పు కూడా ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండటంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.