బోయిన్ పల్లి టీఆర్ఎస్ నేతలకు సీఎం ఫోన్ కాల్

బోయిన్ పల్లి టీఆర్ఎస్ నేతలకు సీఎం ఫోన్ కాల్

రైతులుసంతోషంగా ఉన్నారా?

నాట్లు వేశారా.. ఏమైనా సమస్యలున్నాయా?

బోయిన్ పల్లి, వెలుగు: మిడ్ మానేరుకు గోదావరిజలాలు వస్తున్నాయని రైతులకు చెప్పా లంటూసీఎం కేసీఆర్ తమను ఆదేశించారని బోయిన్పల్లి టీఆర్ఎస్ నేతలు చెప్పారు . శుక్రవారంసీఎం కేసీఆర్ మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి ,ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ లకు ఫోన్ చేశారు.దాదాపు 15 నిమిషాల పాటు సీఎం వారితో మా-ట్లా డారు. మిడ్ మానేరు నిర్వాసితు ల సమస్యలతోపాటు, మిడ్ మానేరుకు గోదావరి జలాల రాకపైరైతుల స్పం దనను అడిగి తెలుసుకు న్నారు. ని-ర్వాసితు ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు సీఎం చెప్పారన్నారు. పెండింగ్ పనులు ఏవైనా ఉంటే కలెక్టర్ ను కలిసి మాట్లాడాలని సూచించారని అన్నారు. రైతులుసంతోషంగా ఉన్నారా?, వరినాట్లు వేశారా? అనికనుక్కున్నారని చెప్పారు .

ప్రజలకు రైతులకు మేలు కలిగే పనులే చేస్తామని చెబుతూ.. ఇదే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పండంటూ సీఎం సూచించారట. మిడ్ మానేరు కు నీటి ప్రవాహంఎలా ఉందని సీఎం అడగగా.. ప్రస్తుతం రెండుమోటార్లతోనే ఎత్తిపోస్తుండడంతో 2500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని చెప్పా మన్నారు. మరో మూడు రోజుల్లో నీటి విడుదల పెరుగుతుందని చెబుతూ, కాలువలో మోటార్లు ఉంటే తీసేసుకోవాలని  రైతులకు సూచించాలని సీఎం చెప్పారన్నారు. ఎల్ఎండీకి నీటి విడుదలబోయిన్ పల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్మానేరు నుంచి శుక్రవారం ఎల్ఎండీకి నీటిని విడుదల చేశారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువద్వారా మిడ్ మానేరులోకి గోదావరి జలాలు వచ్చిచేరుతున్నాయి. దీనితో రివర్ స్లూయిస్ ద్వారా ఎల్ఎండీకి 3000 క్యూ సెక్కుల నీటిని వదులుతున్నట్లు ఎస్ఈ శ్రీకాంత్ రావు చెప్పారు .